మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి లోకేష్ సూచనలతో నేపాల్‌లో చిక్కుకున్న మంగళగిరి పట్టణ వాసుల కుటుంబసభ్యులను ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా నేపాల్‌లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ ద్వారా మాట్లాడి, వారు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు సురక్షితంగా తిరిగిరావడానికి అన్ని విధాలుగా సహాయపడుతోందని హామీ ఇస్తూ కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఉదయం నుంచి రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఖాట్మండు, సిమికోట్, పోఖారా ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయాలతో పాటు భారత విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నారు. ఖాట్మండు నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ద్వారా బాధితులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అనంతరం జిల్లా అధికారులు సమన్వయంతో బాధితులను తమ స్వస్థలాలకు చేర్చే చర్యలు మంత్రి లోకేష్ చొరవతో వేగవంతంగా కొనసాగుతున్నాయని ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
