December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

* గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 11 రోజులపాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న జిల్లా పోలీసు శాఖ.

* సమాజంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యం..

* సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో అవసరం.. అందుకోసం ప్రజలందరూ చట్టాన్ని అనుసరించి, మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు.

* దేశ సరిహద్దులు మొదలుకొని దేశ అంతర్గతంగా శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసుల పాత్ర చాలా కీలకం.

* పోలీసు అమరవీరులు యొక్క ధైర్య సాహసాలను, త్యాగనిరతిని స్మరించుకోవడం మనందరి భాద్యత.

జిల్లా ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు- 2024 రేపటినుండి ప్రారంభం అవుతాయని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ డిజిపి శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్., వారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 11 రోజుల పాటు 21.10.2024 వ తేదీ నుండి 31.10.2024 వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ గారు ఈరోజు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ సమాజంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యం.. అందుకోసం దేశ సరిహద్దులు మొదలుకొని దేశ అంతర్గతంగా శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజ అభ్యున్నతి కోసం పోరాడుతున్నారు. విధి నిర్వహణలో అమరులైన వారందరి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారి పేర్లను మననం చేసుకోవడం మన బాధ్యత అన్నారు.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో అవసరం.. అందుకోసం ప్రజలందరూ చట్టాన్ని అనుసరించి, మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు:

21.10.2024 వ తేది- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం – స్మృతి పెరేడ్ – ముఖ్యంగా అసాంఘిక శక్తులతో పోరాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను, స్ఫూర్తిదాయక సేవలను స్మరించుకుంటూ రేపు ఉదయం 7:30am గంటలకు తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానం నందు పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్మృతి పెరేడ్ ద్వారా ఘనంగా నివాళులు అర్పించి, వారి యొక్క పేర్లను మననం చేసుకుని, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు, ప్రముఖులు పాల్గొంటారు.

22.10.2024 to 30.10.2024 – అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించడం:
* పోలీస్ అధికారులు అమరవీరుల యొక్క గ్రామాలు/పట్టణాలలో పర్యటించి, అమరవీరులు యొక్క ధైర్య సాహసాలను, త్యాగనిరతిని స్థానికులకు తెలియజేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో వారి యొక్క ఫోటోలను పెట్టి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.
* అమరవీరుల స్వస్థలంలో ఏదైనా పాఠశాలకు/ రోడ్డుకు వారి యొక్క పేరును పెట్టే ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
* అమరవీరులు చదువుకున్న స్కూలు/ కాలేజీలలో వారి ఫోటోలను ప్రదర్శించి, పిల్లలలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తామన్నారు.
* పోలీసులు యొక్క ధైర్య సాహసాలను తెలియజేసే సినిమాలను, షార్ట్ ఫిలిం లను, వీడియోలను Social Media Influencers తో ప్రచార మాధ్యమాలలో బాగా ప్రచారం చేయిస్తామన్నారు.

24.10.2024 to 27.10.2024 – వ్యాసరచన పోటీలు మరియు బృంద చర్చలు పోటీలు నిర్వహణ.
* పాఠశాల/ కళాశాలలో విద్యార్థులతో “Role of Youth in Prevention of Cyber Crime” అనే విషయంపై వ్యాసరచన పోటీలు మరియు బృంద చర్చలు పోటీలు నిర్వహణ..
* పోలీసుల యొక్క పిల్లలు మరియు పోలీసులతో “Challenges to Police in the present Environment” అనే విషయంపై వ్యాసరచన పోటీలు మరియు బృంద చర్చలు పోటీలు నిర్వహిస్తామన్నారు.

26.10.2024 to 27.10.2024 – ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్:
పోలీసుల యొక్క పోరాట వాహనాలు, బాంబు డిస్పోజల్ట్ ఎక్విప్మెంట్, UAC, మొదలగు విషయాలపై పోలీస్ పెరేడ్ మైదానం నందు ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిచయం చేస్తూ వారికి పోలీసు శాఖపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

28.10.2024 – మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరాలు:
స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో మరియు జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో నిర్వహిస్తామన్నారు.

29.10.2024 – సెమినార్లు, ఉపన్యాసాలు:
ప్రముఖ పోలీసుల త్యాగాలపై పాఠశాల కళాశాలలో విద్యార్థులతో సెమినార్లు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామన్నారు.

30.10.2024 – పోలీస్ అమరవీరులను స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక విజయాలు సాధించిన వారి సోదరీ సోదరులను సన్మాని…

Related posts

విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ*

TNR NEWS

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

TNR NEWS

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

TNR NEWS

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

TNR NEWS