తిరుపతి జిల్లా…
*కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*
* *కేసు నమోదు చేయడం.. ముద్దాయిలను అరెస్టు చేయడం సరిపోదు..*
* *కేసు నిరూపణ చేసి, నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది.*
* *ప్రతి కేసు నిరూపణ చేయుటకు చిత్తశుద్ధితో పనిచేసి, బాధితులకు న్యాయం చేయవలసిన మహత్తర బాధ్యత మీపై ఉన్నది.*
* *నిజాయితీగా పనిచేసిన వారికి రివార్డులతో ప్రోత్సహిస్తాం.. చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.*
*జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,*
ఈరోజు జిల్లా ఎస్పీ గారు జిల్లా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం అధికార సిబ్బందితో స్థానిక పోలీస్ పెరేడ్ మైదానం నందు జిల్లాలోని పెండింగ్ కేసుల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ కేసు నమోదు చేయడం.. ముద్దాయిలను అరెస్టు చేయడం.. చార్జ్ షీటు వేయడం.. ఒక ఎత్తు అయితే, కోర్టులో విధివిధానాలను సరిగ్గా పాటించి, కేసును నిరూపణ చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు అయిన మీరు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నరు. కావున ప్రతి కేసు నిరూపణ చేయుటకు చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు న్యాయం చేయవలసిన మహత్తర బాధ్యత మీదేనన్నారు.
నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎప్పటికప్పుడు సర్వ్ చేయాలన్నారు.
NI యాక్ట్ కేసులపై, పాత పెండింగ్ కేసులపై శ్రద్ధ చూపి, వారెంట్లు సర్వ్ చేయాలన్నారు.
గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు పాత పెండింగ్ కేసుల విచారణ పూర్తి అయ్యేటట్లు గౌరవ కోర్టు వారికి సూచనల మేరకు పనిచేయలన్నారు.
పోలీసుల అలసత్వం వలన కోర్టులో విచారణ పెండింగ్ లేకుండా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిస్టం వారు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి కేసు నిరూపణ వచ్చే విధంగా దర్యాప్తు అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే.. ఆ రికార్డులను కోర్టు కానిస్టేబుళ్లు జాగ్రత్త పరచాలన్నారు.
కేసు విచారణ సమయంలో సాక్షులు, సాక్షాధారాలు, రికార్డులను కోర్టు కానిస్టేబుళ్లు కోర్టులో పొందుపరచాలన్నారు.
దర్యాప్తు అధికారులు కేసు విచారణకు హాజరయ్యేలాగా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం వారు బాధ్యతాయుతంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, కేసులు నిరూపణ చేస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను ప్రజలలో పెంపొందింపజేయాలని కోర్టు కానిస్టేబుళ్లకు దిశా నిర్దేశం చేశారు.
నిజాయితీగా బాగా పని చేసేవారికి రివార్డులు ఇస్తాము.. చట్టాన్ని అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ వెంకట్రావు పరిపాలన, సిఐలు సుబ్రహ్మణ్యం డిసిఆర్బి, వెంకటప్ప కోర్ట్ మానిటరింగ్ సిస్టం, కోర్టు లైజన్ ఆఫీసర్లు, జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం సిబ్బంది పాల్గొన్నారు.