జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కోదాడ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న స్వరూప రాణి ఎంపికయ్యారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

previous post
next post