Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

సూర్యాపేట: గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను లబ్ధిదారులకు పట్టాలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్లూరి గోవిందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 804 మంది లబ్ధిదారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్లను కేటాయించకపోవడంతో లబ్ధిదారులు సంవత్సర కాలం నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు వచ్చిందన్న సంతోషం పేదల్లో కనపడటం లేదని గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నారని నేడు ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని ఆయనే వెంటనే కలగజేసుకొని పేదలందరికీ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పట్టాలు ఇచ్చిన పేదలకు ఇండ్లు కేటాయించాలన్నారు. గత సంవత్సర కాలంగా ఇండ్లు కేటాయించకపోవడంతో ఇండ్లు శిథిలావస్థలోకి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లలో పనులు పూర్తి కాలేదని కొన్ని పనులు పూర్తి అయిన మొత్తం ధ్వంసం చేయబడి ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టర్ తో మాట్లాడి ఇళ్లను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి లబ్ధిదారులకు కేటాయించాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, మామిడి సుందరయ్య, గంగపురి శశిరేఖ, పిట్టల రాణి, వట్టే ఎర్రయ్య, మాధగోని మల్లయ్య, నాయకురాలు బిక్షమమ్మ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………

Harish Hs

ఎన్యుమరేటర్లకు తగు సమాచారం ఇవ్వండి

Harish Hs

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి

Harish Hs

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs