నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు అందరూ ఆహ్వానితులే అని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ అన్నారు మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాకు విద్యార్హతలు ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, పిజి కోర్సులు చేసిన వారు మరియు ఈ జాబ్ సెక్టర్ కు ఐటి, బ్యాంకింగ్, ఫార్మసీ, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్, ఇండస్ట్రీ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ బిపిఓ అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ సంపత్ గారు మాట్లాడుతూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి యొక్క వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. మరియు వారి బయోడేటాను ఐదు కాపీలు వాటితో పాటుగా ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, అర్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు తో పాటు రెండు ఫోటోలు తీసుకొని తేదీ 13 అక్టోబర్ 2025 రోజున వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల అనంతారం క్యాంపస్ నిర్వహించే జాబ్ మేళాకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు హాజరు కావాలని, వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే ఈ జాబ్ మేళాకు అందరూ సమయానికి రావాలని, ఈ మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.