సూర్యా పేట: శ్రీరామ్ సాగర్ రెండవ దశ రూపకర్త స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ దివంగత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితంగానే శ్రీరాంసాగర్ రెండో దశ శంకుస్థాపన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో శంకుస్థాపన జరిగిందని ఎం సిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బి.యన్.రెడ్డి
తుంగతుర్తి ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతం నికి న్యాయం చేయాలని ఆనాడు నల్లగొండ జిల్లా సగభాగంగా ఉన్న సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్ సగం కోదాడ నియోజకవర్గాలలో సాగు తాగునీరు అందించాలని ఆరాటపడి ఆనాడు 1996 మార్చి 6న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో తిరుమలగిరి ప్రగతి నగర్ వద్ద శంకుస్థాపన చేయించి ఈ ప్రాంతంలో కరువును నివారించాలని చెప్పి ఆరటపడిన మహానీయుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి అని గుర్తు చేశారు. 2008 మే 9న మరణించడంతో అదే నెల సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన బి.ఎన్.రెడ్డి మే 16న జరిగిన వర్ధంతి సభలో శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టుకు బి.యన్ రెడ్డి పేరుని నామకరణం చేయాలని ఆనాటి మంత్రి కె,జానారెడ్డి, ఎమ్మెల్యే ఆర్, దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారని తెలిపారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే సూర్యాపేటలో ఒక సభలో ఆనాడు మంత్రిగా ఉన్న జానా రెడ్డి ద్వారా ఈ ప్రాంతంలో సాగు తాగునీరుకు ఇబ్బందులు జరుగుతా నా యి దీనికి శ్రీరామ్ సాగరే శరణ్యమని శ్రీరాంసాగర్ సాధించకపోతే ఈ ప్రాంతం చాలా వెనకబడి నా ప్రాంతంగా ఉంటదని వారికి చెప్పి ఆనాడు కాలువలు తవ్వించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇది ప్రజలకు ప్రజా త్రంతుల వాదులకు అందరికీ తెలుసునని
అప్పటికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ప్రజలను సమీకరించి శ్రమదానం ద్వారానైనా కాలువలను తవ్విస్తానని ప్రకటించిన లీడర్ కామ్రేడ్ బియన్ రెడ్డి ఇది జగమెరిగిన సత్యం తరవాత ప్రభుత్వాలు దిగివచ్చి కాలువలు తోవ్వడం నీరు రావడం జరిగిపోయింది ఈ కాలువకు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆ ప్రాంత ఎమ్మెల్యే కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసిపియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని అన్నారు. అనేకమంది ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశాయి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మంత్రులు కడియం శ్రీహరి పొన్నాల లక్ష్మయ్య బి.యన్.రెడ్డి పేరుని పెట్టాలని వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నేటికీ ఆ పోరాటం కొనసాగుతా ఉంది అది పెడచెవున పెడుతున్న ప్రభుత్వాలు ఇప్పుడు దామోదర్ రెడ్డి పేరు పెడతామనటం ఎంతవరకు సమంజసం
దామోదర్ రెడ్డి పేరు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు కానీ వారి పేరు పెట్టడానికి విద్యాసంస్థలకి భవనాలకు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ శ్రీరాంసాగర్ రెండవ దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు ను నామకరణ చేయాలని ఎంసిపిఐ యు డిమాండ్ చేస్తుందని తెలిపారు.