పేకాట ఆడుతున్న అరుగురిని అరెస్టు చేసిన సంఘటన చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి బీబీగూడెం శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా పేకాట ఆడుతున్న వ్యక్తులు సుంకరి సైదులు,కలకోట్ల రవి, పడిదల గురువయ్య, పడిదల సైదులు, కొదమగుండ్ల నగేష్,ఏదాసు నాగయ్య లను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు వేల రూపాయల నగదు,ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చివ్వేంల ఎస్ ఐ మహేష్ తెలిపారు.