మోతె, అక్టోబర్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగుల అందరికీ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మోతె మండలం ఎమ్మార్వో వెంకన్న కి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక మోతె మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో వెంకన్న ని సంఘం నేతలతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఎమ్మార్వో వెంకన్న ను శాలువాతో ఘనంగా సత్కరించి మండలంలో వికలాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన వికలాంగులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మార్వో వెంకన్న దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురి అవుతూ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని వికలాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వికలాంగులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, ఎమ్మార్పీఎస్ మోతె మండల అధ్యక్షులు బైరు పంగు విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు బోర్ర సునీల్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జిల్లా నాయకులు జిల్లపల్లి శివకృష్ణ, సంఘం నాయకులు బొల్లం లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
