పవన్ కళ్యాణ్ స్పూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మచ్చా గంగాధర్
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన మోడే శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా, శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, తన సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉందని తెలుసుకుని, వారి కుటుంబానికి తన వంతు సహాయంగా 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ తన దాతృత్వం చాటుకుంటున్నారని, కుటుంబ పెద్ద మరణించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ 297 కుటుంబాలకు ఆయన అందించారని, తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సుజాత, బంటు లీల, మోనా, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
