జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు.ఈ మానవరహిత డ్రోన్..చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఘగ్వాల్ సెక్టార్లోని రీగల్ గ్రామంపై కొన్ని నిమిషాలు సంచరించి,మళ్లీ సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి వెళ్లినట్లు వెల్లడించారు.భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
