గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
previous post
