చివ్వెంల:2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట టు టౌన్ కుడ కుడ 1 వ వార్డు లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన హింస, అత్యాచారాలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. దేశంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మహిళలను రక్షించడానికి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల రక్షణ కోసం పనిచేయడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీ ల అమలులో బతుకమ్మ చీరలు అందరి మహిళలకి ఇవ్వాలని, గృహిణులకు 2500 పెన్షన్ పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలోపు మహిళలకు ఈ పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. జమ్ము కాశ్మీర్ లోన కతువాలో ఎనిమిదేళ్ల ఆసిఫాపై జరిగిన ఉదంతం, మణిపూర్ లో రావణకాష్టంలా జరుగుతున్న మహిళలపై దాడులు దురాగతాలు,బిల్కిస్ భాను కేసులో నిర్లజ్జగా నిందితుల విడుదల,వారికి కొమ్ము కాయడం, మహిళా రేజర్లల పోరాటాన్ని చెవిన పెట్టకపోవడం, నిందితులకే కేంద్ర ప్రభుత్వం అండగా నిలవడం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. మనువాదాన్ని నమ్ముతూ, ఆచరణలో అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ – బిజెపి పాలన కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో నడుస్తుంది. మనువాదం మహిళలకు స్వేచ్ఛ ఉండకూడదని, బానిసలుగా బతకాలని శాసిస్తోంది. హైదరాబాదులో జరుగుతున్న ఈ 14వ జాతీయ మహాసభల సందర్భంగా మహిళల స్వేచ్ఛ, సమానత్వం, ఉపాధి, అధిక దరలు,ఆడపిల్లల భ్రూణహత్యలు, పెరుగుతున్న హింస, అణచివేతలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు,బాలికలను చైతన్యవంతం చేస్తూ, సెమినార్ లు సదస్సులు, ఎగ్జిబిషన్లు కళాజాతాల నిర్వహణకు సమాయత్తమవుతుంది ఈ సందర్భంగా మహిళా ఉద్యమాన్ని మరింతలోపేతం చేసేందుకు మహిళలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, జిల్లా కమిటీ సభ్యురాలు పిండిగా నాగమణి మహిళా సంఘం వార్డు కమిటీసభ్యురాలు ఆవుదొడ్డి భాగ్యమ్మ, వాణి, స్వరూప, పుష్ప, శ్రీలత, రాములమ్మ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
