గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించి వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ చానల్ ద్వారా వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని తెలియజేస్తూ సమ్మె నోటీస్ ను ఇవ్వడం జరిగిందని.గ్రామ పంచాయితీలలో 40 సంవత్సరాల నుండి పంచాయితీలనే నమ్ముకుని సేవలు చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని,ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని,అట్లాగే కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుండి ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు చెల్లిస్తారని ప్రకటించడం జరిగింది వెంటనే కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి వాసిమేకల వెంకటేశ్వర్లు, యూనియన్ మండల అధ్యక్షులు ఎల్ నాగార్జున, కార్యదర్శి మామిడి వెంకటేశ్వర్లు, నాయకులు ధారా రవికుమార్,శంకర్ , షేక్ సైద్ జానీ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post