ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్హ 30 చెస్ పజిల్స్‌ను పరిష్కరించడంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె ప్రదర్శించిన ఈ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ రికార్డు దక్కింది. అల్లు అర్జున్ తరచూ పంచుకునే క్యూట్ వీడియోలతో అర్హ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలైంది.గతంలో ‘శాకుంతలం’ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసి తన నటనతో, స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణతో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు చదువుతో పాటు చదరంగంలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తుండటంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రికి తగ్గ కూతురని, అల్లు అర్జున్ స్ఫూర్తిని అర్హ కొనసాగిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
previous post
