November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో, ఆల్ రౌండర్ స్టార్, దర్శక నిర్మాత, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని భారత వికాస్ కళా పరిషత్ హాల్ రామాలయం వీధిలో జరిగింది. శేరిలింగంపల్లి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్, సినీ దర్శక నిర్మాత లయన్ సాయివెంకట్ లు ముఖ్య అతిథులుగా హాజరై 20 శాఖల సినీ ప్రపంచ రికార్డు నెలకొల్పిన బల్లెం వేణు మాధవ్ బహుముఖ ప్రజ్ఞకు ప్రశంసగా ఘన సత్కారం చేసి “ఆల్ అబౌట్ గణేశ” అనే భారీ పుస్తకంతో పాటు, ఒక జ్ఞాపికను అందించి శాలువ కప్పి స్వర్ణ పతకం వేసి అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు దర్శక నిర్మాత టి.రాము బల్లెం వేణుమాధవ్ ని పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు “సిపాయే రాజైతే” నాటకాన్ని ప్రదర్శించారు. ఇదే వేదిక మీద బల్లెం వేణు మాధవ్, సాయి వెంకట్ ల చేతుల మీదుగా “బాహునిధి” చిత్ర లోగో ఆవిష్కరణ జరిగింది. “శాంతి”, “నన్ను ప్రేమించవా”, “కలలు కనకే చెలియా”, “కౌసల్య ఆంటీ”, “అయ్యప్ప సాక్షి”, “ప్రేమ గులాబి” తనకు పేరు తెచ్చిన సినిమాలు అని బల్లెం వేణుమాధవ్ అన్నారు. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృతజ్ఞతా ప్రసంగాన్ని చేస్తూ అంతరించి పోతున్న నాటకాన్ని బ్రతికిస్తున్న టి.రాము కృషిని అభినందిస్తున్నానని బల్లెం వేణుమాధవ్ అన్నారు. డా. జి.డి.నాయుడు, దర్శక నిర్మాత టి.రాము, ఎడిటర్ వేణులు ప్రసంగించారు. పలువురు సినీ ప్రముఖులు సత్కారం అందుకున్న బల్లెం వేణుమాధవ్ కు తమ అభినందనలు తెలిపారు.

Related posts

8 వసంతలు’ నుండి ఫస్ట్ సింగల్ అవుట్

TNR NEWS

త్వరలో జరగబోయే బుస్సా విజేత అవార్డ్స్ కు ప్రముఖుల శుభాకాంక్షలు

Dr Suneelkumar Yandra

సేవ్ స్మాల్ సినిమా

Dr Suneelkumar Yandra

రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న ‘వీర ధీర శూరన్‌’

TNR NEWS

‘డ్రాగన్’ సినిమాను మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నా

TNR NEWS

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది

TNR NEWS