*సమస్యల పరిష్కారానికి కృషి…..*
మునగాల: గ్రామంలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సర్పంచి కుంచం ఇందిరా, నర్సయ్య అన్నారు. మునగాల మండలంలోని నర్సింహులగూడెంలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లో స్థానంలో
నూతన స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అలాగే గ్రామస్థుల సహకారంతో మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతారాములు, వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.
