తుని, మార్చి 03 : ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని, త్రయీ సాధన ద్వారా అనుభవంలో గ్రహించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేసారు. తుని పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళన సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా, హిందూ మత ప్రతినిధి డా శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేరమాంబ, ఇస్లాం మత ప్రతినిధిగా షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధిగా రెవ ఎస్.బాలశౌరి, బౌద్ధ మత ప్రతినిధిగా మహోదయ ఎన్.పెద్దిరాజు, పీస్ ఫౌండేషన్, విజయవాడ శ్రీ మహమ్మద్ పాషా మత సమరస్య సదస్సులో పాల్గొని, ప్రసంగించి, అనంతరం చెయ్యి చెయ్యి పైకెత్తి, దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ 250 సంవత్సరాల క్రితం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలీ సద్గురువర్యులు ఈ దర్గా ప్రాంగణంలో ఉండి, భిన్నత్త్వంలో ఏకత్వం తెలియచేయు అర్ష సూఫీ తత్వం ప్రభోదించుటయే కాక కల్కి భాగవతం అనే గ్రంధం దరువు కీర్తనల రూపంలో రచించారు. మానవత్వమే మతం అనే ఆధ్యాత్మిక భావం ఏర్పడుతుంది అని డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వాలంటీర్ లకు చీరలు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు, ఆశ్రమ సేవకులకు నూతన వస్త్రాలను, మహిళలకు మూడు కుట్టు మిషన్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పంపిణి చేసారు. మతాదిపతులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి సత్కరించగా, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామిని తుని కమిటీ సభ్యులు సత్కరించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి మత సామారస్య సదస్సును ఆవిష్కరించారు. ముందుగా పీఠం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సాహిత్య, సేవా కార్యక్రమాలు తెలియచేయు ఫోటో ఎగ్జిబిషన్ మరియు ఉచిత మజ్జిగ చలి వేంద్రంను ఆవిష్కరించారు. నోబెల్ ఐటిఐ కరెస్పాండంట్ గోసుల వీర వెంకట సత్యనారాయణ 2026 నివేదిక తెలియ చేయగా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం చరిత్రను సభకు వివరించారు. హిందూ మత ప్రతినిధి డా శ్రీపాద సీతా మహాలక్ష్మి సత్యవతి పేరమాంబ మాట్లాడుతూ సనాతన ధర్మం యొక్క విశిష్టతను సభకు వివరించారు. పరోపకారం చెయ్యాలని, ఇతరులకు అపకారం చేయుట మహా పాపం అని అన్నారు. ఇస్లాం మత ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ మాట్లాడుతూ అరబ్ ప్రపంచంలో శాంతి స్థాపనకు మహమ్మద్ ప్రవక్త కృషి చేసారని అన్నారు. రెవ ఎస్.బాల శౌరి మాట్లాడుతూ పరలోకానికి భూలోకానికి కర్తగా ఉన్నవాడే భగవంతుడు అని బైబిల్ లో ఉన్న 10 అజ్ఞాలు ప్రతీ ఒక్కరూ పాటించాలని అన్నారు. బౌద్ధ మత ప్రతినిధి మహోదయ ఎన్.పెద్ది రాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి దారి చూపిదే బౌద్ధ ధర్మం అని చెబుతూ జీవహింస చేయరాదు, దొంగతనం చేయరాదు, కామ మోహాదూలకు దూరంగా ఉండి, నీతివంతంగా ఉండాలి, సత్యాన్నే పలుకు, మత్తు పానీయాలకు, మత్తు మందులకు దూరంగా ఉండు అని చెప్పిరి. పీస్ ఫౌండేషన్ అధినేత మహహ్మద్ పాషా మాట్లాడుతూ నేటి మత సమరస్య సదస్సు ప్రపంచ శాంతికి భీజం వేస్తోంది అని అభినందించారు. ప్రతీ ఒక్కరికీ న్యాయం, సమానత్వపు హక్కులు ఉండాలి అన్నారు. ఆధిపత్య ధోరణి అవలంభించ కూడదు అన్నారు.
- నూతన పుస్తకవిష్కరణ
మిర్జా మస్రూర్ అహ్మద్ చే రచింపబడిన “వరల్డ్ క్రైసిస్ – పీస్” అనే గ్రంధాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించి వేదికపై ఉన్న మతాదిపతులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జి.వి.వి.సత్యనారాయణ, అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి, గొర్ల ఆదినారాయణ, జంపన కేశవరాజు, గోసుల రమణ, కోండి వెంకట అప్పారావు, చిటికెల సత్యనారాయణ మాస్టారు, బేక్కం రమణ, జగ్గబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ ప్రసాద వర్మ తదితరులు పాల్గొన్నారు.
