Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
రాజకీయం

ఐక్యతకు, స్నేహభావాలకు వనభోజన మహోత్సవాలు ప్రతీకలు

టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

ఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని ద్వారకుంట ఇండస్ట్రీస్ ఏరియా సమీపంలోని ఎర్నేని వెంకటరత్నం బాబు మామిడి తోటలో ఏర్పాటుచేసిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కార్తీక వనభోజన మహోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సభ్యుల మధ్య సోదర భావాలు పెంపొందుతాయన్నారు సామాజిక సేవా రంగాల్లో కాకతీయ కమ్మ కులస్తులు అగ్రస్థానంలో నిలిచి అందరి కి ఆదర్శంగా ఉండాలన్నారు. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మాట్లాడుతూ పూర్వం నుండి సమాజ శ్రేయస్సు కోసం వనభోజన మహోత్సవాలు ఆచారంగా నిర్వహిస్తున్నామని ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అభినందనీయమన్నారు ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు కాగా కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని బాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కాకతీయ కమ్మ వనభోజనాలకు కోదాడ మేళ్లచెరువు పరిసర గ్రామాల క మ్మ కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు పూజా కార్యక్రమాలతో పాటు ఆటపాట కార్యక్రమాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో వనభోజన మహోత్సవం దిగ్విజయంగా కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ను కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సన్మానించారు.

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

TNR NEWS

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS