Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

 

హైదరాబాద్ ; ఇండ్ల స్థలాలపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ రేపోమాపో ఇండ్ల స్థలాలు ఇస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి.. ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా సెలవిచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని స్పష్టంచేశారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. తాము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామని, రెండో విడత రెండోసారి అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం కొట్లాడారని, అయినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టుల ఇండ్లస్థలాలను క్లియ ర్‌ చేశామని పేర్కొన్నారు. రెండో విడత ఇండ్ల ను తాము రెండోసారి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఫ్యూచర్‌ సిటీలో స్థలాలు వస్తాయని భావిస్తున్న జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. మరికొన్నేండ్లు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూపులు తప్పవని సీఎం వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయని జర్నలిస్టులు పెదవి విరుస్తున్నారు.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీచేశామ ని, న్యాయ వివాదాలను పరిష్కరించి నియామకాలపై దృష్టిసారించామని సీఎం రేవంత్‌ చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్‌-1 సహా అన్ని స్థాయిల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని, వారి ఉద్యమాలకు కాంగ్రెస్‌ అండగా నిలిచిందని చెప్పుకున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని.. కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Related posts

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 

Harish Hs

ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్

Harish Hs

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

రవితేజ స్కూల్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం

TNR NEWS

రిల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి

TNR NEWS