మెట్ పల్లి:
సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ లో మంగళవారం జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని సూచించారు. జూనియర్ విద్యార్థుల కోసం స్వాగతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ విద్యార్థులను ఆయన అభినందించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన పూర్వ విద్యార్థులను కరస్పాండెంట్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ హెప్సిబా, ప్రిన్సిపాల్ సంతోష్, డైరెక్టర్ బండారి కమలాకర్ రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.