, గజ్వేల్ :
ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థి అమరవీరుల ఆశయ సాధన కోసం విద్యార్థులంతా ఉద్యమించాలని పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. విద్యార్థి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం సిద్దిపేటలోని జిఎన్ఆర్ కళాశాలలో సంస్మరణ సభను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎస్వి. శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ దోపిడీపీడనలేని సమ సమాజం కోసం తపించి జార్జిరెడ్డి మొదలు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి , కోలాశంకర్, రంగవల్లి, స్నేహలత, మారోజు వీరన్న లాంటి అనేకమంది విప్లవ వీర కిశోరాలు తమ విలువైన ప్రాణాలను అర్పించారని అన్నారు. పీ.డీ.ఎస్.యు సిద్ధం పది దశాబ్దాల కాలంగా శాస్త్రీయ విద్యాసాధన కోసం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. విద్యార్థి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల వారోత్సవాలను వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ముగింపు సభను నవంబర్ 16వ తేదీన దుబ్బాక డివిజన్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గణేష్, సంఘం నాయకులు చెప్యాల యాదగిరి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.