కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..21 తారీకు నుండి 24 తారీకు వరకు జరుగు గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తించి వారికి రైతు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.