పాలేరు వాగు పై నిర్మిస్తున్న లిఫ్టు పనుల్లో అలసత్యం వహిస్తే సహించేది లేదని, అక్టోబర్ నాటికి పనులు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు,కాంట్రాక్టర్ కు సూచించారు.శుక్రవారం సాయంత్రం కోదాడ మండలం రెట్లకుంటలో పాలేరు వాగు పై రూ.47.64 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ పనులను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించి మాట్లాడారు..