మునగాల మండలం పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ గారి పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలకు ఆటపాటలు ,క్విజ్ అహల్లాదకరమైన వాతావరణంలో నిర్వహించి పిల్లలకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సతీష్ కుమార్, సహోపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వి. నాగమణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు విద్యార్థులందరికీ నోటు పుస్తకములు బహుకరించటంజరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే ప్రారంభమవుతుందని, మన దేశ తొలి ప్రధాని వ్యాఖ్యానించిన అంశాలను ప్రస్తిస్తూ ఆ గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై, సమాజంపై ఉంటుందని, నేటి బాలురే రేపటి భావి భారత పౌరులుగా దేశానికి దిక్సూచిగా దిశా నిర్దేశం చేయగలరని, విజ్ఞాన దీపికలు కాగలరని, బాల్యము క్రమశిక్షణతో ఆటపాటలతో ఆనందకరంగా విజ్ఞానదాయకంగా ఉండాలని తెలియజేసినారు.
ఉపాధ్యాయుడు ఒక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం రోజు అన్ని తరగతులలో చదువులో ఆటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.