ముస్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ను టిఆర్ఎస్ పార్టీ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు . బిఆర్ఎస్ పార్టీ ప్రజలలో మనుగడ కోలిపోవడంతో
ప్రెస్ మీట్ లు పెట్టి ముఖ్యమంత్రి మీద మా పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మీద నాయకుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న టిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు. జిల్లా నాయకులు లింగంపల్లి ఎల్లా గౌడ్. కాంగ్రెస్ నాయకులు . శ్రీనివాస్. దోనుకుల కొండయ్య. ఉచ్చిడీ బాల్ రెడ్డి. రంజాన్ నరేష్. ఆంజనేయులు నవీన్ .కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.