సంగారెడ్డి జిల్లా, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కంగ్టి మండల రైతులు సంప్రదాయ పంటల స్థానంలో చియా సాగు వైపు అడుగుపెడుతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక రైతుల విజయాలను చూసి ఆకర్షితులై, చియా పంటకు మార్కెట్ లో డిమాండ్ వల్ల చియా సాగు చేస్తున్నట్టు రైతులు వెల్లడించారు.
చియా పంట విత్తనాలు పోషక విలువలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా, పంట సాగులో పెద్ద ఎత్తున నీటి అవసరం లేకుండా, అడవి పందుల బెడద లేకపోవడంతో రైతులకు రైతులు చియా సాగు వైపు మక్కువ చూపుతున్నారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందగలగడం రైతులను మరింత ఈ పంట చేసేందుకే ఉత్సవం చూపిస్తున్నారు.
* *రైతు విజయాలు, రైతుల మాటల్లో*
గత రెండు సంవత్సరాలుగా నాగూర్-కే గ్రామానికి చెందిన రైతు సంజు పాటిల్, కుసుమ, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను వదిలి చియా సాగు ప్రారంభించారు. మొదటి ఏడాదే మంచి ఫలితాలు రావడంతో, రెండవ సారి కూడా సాగు కొనసాగించారు. “90 రోజుల్లో పంట సిద్ధమవుతుంది. 5-7 క్వింటాళ్ల దిగుబడిని పొందుతున్నాం,” అని ఆయన తెలిపారు. ఈ పంటను బీదర్ మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
* *ప్రభుత్వ మద్దతు అవసరం*
రైతుల మధ్య చియా పంటపై పెరుగుతున్న ఆసక్తి ఉన్నప్పటికీ, రైతులకు సరైన విత్తనాల సరఫరా లేకపోవడం, కొనుగోలు మద్దతు లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. “ప్రభుత్వం విత్తనాల సరఫరాలో మద్దతు అందిస్తే, మరింత మంది రైతులు ఈ పంట వైపు చేరుతారు,” అని సంజు పాటిల్ పేర్కొన్నారు.
* *చియా సాగు: తక్కువ ఖర్చుతో అధిక లాభం*
ఇది ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది, ఎందుకంటే చియా పంటకు వారానికి ఒక్కసారి మాత్రమే నీరు అందించడం సరిపోతుంది. పంటకు పెద్దగా చీడపీడలు ఉండవు, కాబట్టి రైతులకు ఈ పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తోంది. ఇది రైతుల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావచ్చు.
* *రైతుల భవిష్యత్తు మార్గం*
సంగారెడ్డి జిల్లాలోని రైతులు చేస్తున్న ఈ చియా సాగు ప్రయోగం, భవిష్యత్తులో తెలంగాణలో మరింత మంది రైతులకు ఆదాయాన్ని పెంచే అవకాశం కలిగించే పథకంగా నిలవవచ్చు. చియా పంట సాగులో తగిన విధానాలు అమలుచేస్తే, తెలంగాణలో రైతుల ఆదాయం పెంచడం పూర్తిగా సాధ్యమే. “సరైన సాంకేతిక మార్గదర్శనం, కొనుగోలు మద్దతు, మార్కెట్ లింకేజెస్ కల్పిస్తే చియా సాగు తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకురాగలదు,” అని రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
* *ఇతర పంటల సాగు.. రైతు బాగు* …
– *సంతోష్, ఏఈవో నాగూర్ (కె), కంగ్టి*
ఇతర పంటలపై దృష్టి సారించాలి..
సంప్రదాయ పంటలైన మొక్కజొన్న , జొన్న , కుసుమ , వరి పంటకు బదులు ఇతరవంటలపై రైతులు దృష్టి సారించాల్సిన అవసర ముంది. ఎందుకంటే సంప్రదాయ పంటలకు పెట్టుబడితో పాటు నీటివనరులు అధికం కావాలి, చియా పంటకు రెండు మూడు సార్లు నీటిని తడిపితే 6 నెలల్లోపు పంట చేతికొస్తుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పంట కోసిన తర్వాత ఎప్పుడు అయిన అమ్ముకోవచ్చు. రైతులకు నేరుగా చియా పంట సాగు చేసిన పొలానికి వెళ్లి చూపిస్తూ చియా పంటలపై అవగాహన కల్పిస్తున్నాం.