అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గుడిబండ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పలువురు నాయకులు మాట్లాడారు.సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని ఇప్పటినుండి ప్రారంభం అవుతాయి అని తెలియజేశారు.ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుంది అని తెలిపారు. ఆర్డిఓ సూర్యనారాయణ తో కలిసి ప్రజా పాలన సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పథకానికి ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతాసిల్దార్ వాజిద్ అలీ, ఏవో రజిని, ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, నలజాల శ్రీనివాసరావు, నాయకులు నాగిరెడ్డి, నర్సిరెడ్డి, కుక్కడపు నాగరాజు, సైదులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
