November 8, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలి  రైతులు నిపుణుల సూచనలు పాటించాలి  జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ 

 

ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు నిపుణులు అందించే సూచనలు సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. మంగళవారం చివ్వేంల మండలం దూరాజ్ పల్లి శివారులో ని బ్రాహ్మణ సదన్ లో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ, ఉద్యాన శాఖ వారు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు నిర్వహించిన అవగాహనా సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్ పామ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, ఈ ప్రాంత రైతులు నీటి వసతి ఉంటే వరికి ప్రత్యామ్నాయం గా ఆయిల్ పామ్ తోటలు సాగుచేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించె రాయితి లను సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ సాగు చేసినట్టు అయితే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించ వచ్చు అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం ఆయిల్ పామ్ గెలల ధర బాగా పెరిగాయని ఇప్పుడు ఈ పంట సాగుచేసే విదంగా రైతులను చైతన్య వంతులను చేయవలసిన బాధ్యత వ్యవసాయ అనుబంధం శాఖ లపైన్ ఉండన్నారు. ఈ కార్యక్రమం జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, ఆగ్రోనామిస్ట్ సుబ్బారావు ,పతంజలి డి జి ఎం బి యాదగిరి, ఉద్యాన అధికారులు మహేష్, కట్ట స్వాతి, ప్రమిత, ప్రదీపిత్తి, పతంజలి మేనేజర్ జె హరీష్, జూనియర్ మేనేజర్ శశి కుమార్, ఫిల్డ్ ఆఫీసర్లు వెంకట్, సాయి, అశోక్, రవి కుమార్, సిబ్బంది రంగు ముత్యంరాజు, సుధాకర్ రెడ్డి, భద్రాచలం, లక్ష్మినారాయణ, పలువురు రైతులు,తదితరులు పాల్గొన్నారు.సదస్సు వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ గారు పర్శిలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Related posts

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TNR NEWS

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

Harish Hs

సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS

తొగుట లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్  

TNR NEWS