రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి బి. రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోని విత్తన నిల్వలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుండే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తన రకం, సంబంధిత బిల్లును తీసుకొని బిల్లులను పంటకాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరచాలన్నారు.స్కీం ల పేరుట, బంపర్ డ్రా ల పేరుట అమ్మే విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు.విత్తన మొలక దశలో పూత దశలో పంటల ఎదుగుదల సరిగ్గా లేకపోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలన్నారు.
తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయి కదా అని పక్కనే ఉన్న రాష్ట్రాల నుండి గానీ, ఒకవేళ వాళ్ళు బిల్ ఇచ్చినా కూడా చేయకూడదు, ఒకవేళ ఏదైనా పంట నష్టం జరిగితే పక్క రాష్ట్రాల నుండి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇప్పించడం కుదరదు అని అన్నారు.