మోడల్ స్కూల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని అన్నారు. బుధవారం టిపిటిఎఫ్ గజ్వెల్ మండల శాఖ ఆధ్వర్యంలో, మోడల్ స్కూల్, గజ్వెల్, బూరుగుపల్లి, కొడకండ్ల, ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి , కోదండరామ్ పల్లి, గుండనపల్లి, రిమ్మనగూడ, ధర్మారెడ్డి పల్లి, కోమటిబండ, దాచారం పాఠశాలలో సమస్యల సేకరణ జరిగింది. మోడల్ స్కూల్ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపగారి పాపిరెడ్డి, జోన్ కన్వీనర్ జల్లెల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గజ్వేల్ మండలంలో నూతనంగా జాయిన్ అయినా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, కేజీబీవీ ల సమస్యలు పరిష్కరించాలని, ఎస్ ఎస్ ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల నాగరాజు, గోక విద్యాసాగర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు పంబాల ఎల్లయ్య, జిల్లా కౌన్సిలర్ దమ్మని మల్లయ్య, ఆకుల శ్రీనివాస్,నాయకులు, పెంటయ్య, మోహన్ రావు,ఓటకారి శ్రీనివాస్, పోచయ్య, ఎర్రవాడ నరసింహులు, పరమేశ్వర్, మీనయ్య తదితరులు పాల్గొన్నారు

previous post