మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి.జిల్లా,మండల నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. సామాజిక న్యాయపోరాటం యోధుడు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో,ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. జిల్లాప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, వికలాంగులహక్కుల పోరాటసమితి జిల్లాఅధికార ప్రతినిధి పేరెల్లి బాబు మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను,మాజీమండల అధ్యక్షుడు లంజపల్లి శ్రీను, మొలుగూరి వెంకటేశ్వర్లు, ఆకుపాముల గ్రామశాఖఅధ్యక్షులు తాళ్లపాక వీరబాబు, రేపాల గ్రామశాఖ అధ్యక్షులు మేరిగ వెంకటేశ్వర్లు, కోదండరామపురం గ్రామశాఖ అధ్యక్షులు గుండెపంగు వీరబాబు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తాళ్లపాక బాబు, తాళ్లపాక అర్జున్,తదితరులు పాల్గొన్నారు.

previous post