కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల కొరకు అన్నదానం దాతలు చిల్లంచర్ల హరికిషన్ జ్ఞాపకార్థం చిల్లంచర్ల మిత్రమండలి సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని దాతలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకురి అంజయ్య,ఆలయ సెక్రటరీ కోట. తిరుపతయ్య, అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి. హనుమంతరావు ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, సత్యం, బ్యాటరీ చారి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు………….