సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమం లో హైదరాబాదు నగరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి.కి చెందిన జాస్తి రైతు సేవా కేంద్రం. నిర్వాహకులు. జాస్తి సురేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా. బాచుపల్లి గ్రామానికి చెందిన వాటర్ సప్లై వ్యాపారస్తులు. కరివేద చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పరిధిలోని నరసింహా పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. పాల్గొని వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. జాస్తి సురేష్ బాబు గారు తన పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించేందుకు వారి సహకారం అందించడం ఎంతో సంతోషదాయకమని. సేవ చేయాలని సంకల్పం ఉంటే. ఏ విధంగానైనా సహాయ సహకారాలు అందించ వచ్చు అనడానికి ఇలా సుదూర ప్రాంతంలో ఉన్న ఇలా ఈ కార్యక్రమానికి సహకరించి ఇలా అనాధలకు వృద్ధులకు. మంచి ఆహారాన్ని అందించడం సంతోషమని ఇలా ప్రతి ఒక్కరు సురేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని వారికి అండగా నిలవాలని అన్నారు ఈ సందర్భంగా సురేష్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో. బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్ఛిపాల రామకృష్ణ మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు యల్ పి శ్రీను. ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ వేమూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.