Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం………  చదరంగంతో పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది…….  శాస్త్రీయ సైన్స్ విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం……….  జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు……

 

విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టు పోటీలకు ఎంఈఓ సలీం షరీఫ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రీయత సైన్సు విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఇటువంటి టాలెంట్ టెస్ట్ లు విద్యార్థుల మేధస్సు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్ జనవిజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు డిఎన్ స్వామి, ఉపాధ్యక్షులు బడుగుల సైదులు, జానకిరామ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు ఎస్ కె కాజా మియా, ముక్తార్, వీర బ్రహ్మచారి, పాండురంగ చారి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు…..

 

*పోటీల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులు*…….

 

మండల స్థాయి చెకుముకి సంబరాలు సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీ పరీక్షలలో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం విభాగంలో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం, తొగరాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచినారు. అనంతగిరి మండలంలో మొదటి స్థానంలో గొండ్రియాల ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండవ స్థానంలో వాయిల సింగారం ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం విభాగంలో కోదాడ మండలం జయ స్కూల్ మొదటి స్థానం తేజ విద్యాలయ విద్యార్థులు రెండవ స్థానం పొందారు. రెసిడెన్షియల్ గురుకులాల విభాగం లో జ్యోతిబాపూలే గురుకుల అనంతగిరి విద్యార్థులు ప్రథమ స్థానం, మైనారిటీ గురుకుల విద్యార్థులు ద్వితీయ స్థానం పొందినారు. ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో కోదాడ మండలం నుండి జెడ్పిహెచ్ఎస్ బాలాజీ నగర్ మొదటి స్థానం, కాపుగల్లు ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం పొందినారు. అనంతగిరి మండలంలో పాలారం ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం, అనంతగిరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీస్తాను పొందినారు. కార్యక్రమంలో 28 ఉన్నత పాఠశాలలు 100 మంది విద్యార్థులు వివిధ భాగాల నుండి పాల్గొన్నారు విజేతలుగా నిలిచిన పాఠశాల విద్యార్థులకు మెమొంటోలు సర్టిఫికెట్స్ పుస్తకాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది …….

Related posts

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

TNR NEWS

కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………

Harish Hs

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

Harish Hs

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs

నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Harish Hs