మునగాల: 65వ నంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ఉన్న సన్న కంకర్ను తొలగించడంలో ఎన్ హెచ్ ఎ ఐ తో పాటు జిఎంఆర్ సంస్థ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి హాస్పిటల్ ఎదురుగా కోదాడ వైపు వెళ్లే రోడ్డుపై స్టాపర్స్ దగ్గర సన్న కంకర కుప్పలు కుప్పలుగా ఉండటంతో అటుగా వెళ్లే టూ వీలర్స్ తో పాటు భారీ వాహనాలు సైతం ప్రమాదాలకు గురవుతున్నాయి అన్నారు. ప్రమాదాలు జరగకుండా ఏర్పాటుచేసిన స్టాపర్స్ ను ముందే గ్రహిస్తున్న వాహనదారులు తమ వాహనాలకు బ్రేక్ వేసిన సమయంలో అట్టి సన్న కంకర జారడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో ఓ ప్రైవేటు బస్సు జారిపోయి పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి దూసుకు పోయిందన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనదారులు కార్లు జారిపోయి ఎంతో మంది క్షత గాత్రులైతున్నప్పటికీ సంబంధిత ఆఫీసర్లు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రతిరోజు రహదారిపై పెట్రోలింగ్ చేసే జిఎంఆర్ సిబ్బంది అట్టి ప్రమాదాలకు కారణం అవుతున్న కంకర ను గుర్తించి తొలగించక పోవడం తగదన్నారు. గురువారం ఒక్కరోజే నాలుగు ద్విచక్ర వాహనాలు జారిపడటంతో బైక్ పై ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు అన్నారు. ఈ రకంగా ఇంకా ఎంతమంది ప్రమాదాలకు గురై చనిపోయేవాలో వారే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఉన్న సన్న కంకర ను తొలగించాలని కోరుతున్నాను.
previous post
next post