కరీంనగర్ ఎడ్యుకేషన్:
పెండిరగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని బుధవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందని, దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అటు చదువులు కొనసాగించలేక, ఇటు మధ్యలో ఆపేయలేక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండిరగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ అభిలాష్, శ్రీనివాస్, నరేష్, సురేష్, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.