Tnrnews.in
తెలంగాణ

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ‌కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని రైతు ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకువచ్చిన ధాన్యం రాశికి నిప్పు అంటించి తగలబెట్టాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

Harish Hs

పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగస్తులకు కోదాడ ఎమ్మెల్యే ఘన సన్మానం.

Harish Hs

జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్

TNR NEWS

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

TNR NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Harish Hs