డా.బి ఆర్అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శుక్రవారం అనంతగిరి రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మురళి డా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు.పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కోనియాడారు.దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నకిరికంటి కరుణాకర్, గరిడేపల్లి రాము కొత్తపల్లి ఉపేందర్,అడ్వకేట్ దావీద్,కాసాని వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.