ఆర్థిక చేయూత ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయం తో ఈనెల 24 న ఒక బీద కుటుంబానికి టీ స్టాల్ ఏర్పాటు చేసి వారికీ జీవనోపాధి కలిపించడం జరిగింది. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ టి మల్లేశం అనే వాస్తవ్యుడు నిరుద్యోగి గత కొంతకాలంగా కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు జీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్థిక చేయూత ఫౌండేషన్ సభ్యులు ఇతని కుటుంబానికి ఏ రకంగా నైనా చేయూతను అందించాలని దృక్పథంతో ఆర్థికంగా సహకరిస్తే కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని ఆలోచించి అతని కుటుంబం ఎప్పుడూ బ్రతికేలా ఒక చిన్న టీ స్టాల్ పెట్టిద్దామని ఆలోచనతో మా బృందం సభ్యులందరూ ఆలోచించి టీ మల్లేశం కుటుంబానికి ప్రేగ్నపూర్ లో ఒక టీ స్టాల్ పెట్టించి జీవనోపాధి కల్పించారు. ఇందుకు గాను వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించి ఆనంద భాష్పాలు వెలబుచ్చారు. వారి ఆనందం చూసి మా సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని అనుకోవడం జరిగింది. గతంలో కూడా మా “ఆర్థిక చేయూత ఫౌండేషన్ ” చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక చేయూత ఫౌండేషన్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.