కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్తమెనూను వసతిగృహాల్లో ఖచ్చితంగా పాటించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ఆదివారం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండురోజుల కిందట ఉడకని భోజనం చేయడంతో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె హాస్టల్ ను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో మూత్రశాలలు, తాగునీటి సరఫరా తీరును ఆమె పరిశీలించారు. మూత్రశాలల సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.