సూర్యాపేట:సిపిఎం 3వ జిల్లా మహాసభలు సందర్భంగా నవంబర్29,30, డిసెంబర్ 1న సూర్యాపేటలో జరిగే మహాసభల సందర్భంగా 29న గాంధీ పార్క్ లో జరిగేబహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు నిచ్చారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయనమాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలు లేనిదే పాలక పక్షాలు తమ ఇష్టానుసారంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలనా కొనసాగిస్తాయని, ప్రజా వ్యతిరేక విధానాలను నికరంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. ప్రజల అభివృద్ధి ఏజెండా పక్కకు పోయి పెట్టుబడిదారులు దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొని దేశాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం సన్నగిళ్ళకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని సంక్షేమానికి సంబంధించిన నిధులు విడుదల కావడం లేదని అన్నారు.రైతులు పండించిన వరి పత్తి వెంటనే కొనుగోలు చేసి డబ్బులు రైతులు ఖాతాలో వేయాలని అన్నారు సి సి ఐ ద్వారా పత్తిని కొనుగోలు వేగవంతం చేసి పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగినఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరిరావు,మట్టి పెళ్లి సైదులు,కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లపల్లి నరసింహారావు, వీరబోయినరవి,మేకన బోయిన శేఖర్, మద్దెల జ్యోతి, మేకన బోయిన సైదమ్మ, చిన్నపంగా నరసయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు,సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్,సిపిఎం టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి,సిపిఎం రూరల్ మండల కార్యదర్శి మే రెడ్డి కృష్ణారెడ్డి,నాయకులు కామ్రేడ్ శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు.