Tnrnews.in
తెలంగాణ

ద్విచక్ర వాహనం పట్టివేత

నెక్కొండ  నాటు సారా నిర్మూలనకై నిర్వహిస్తున్న దాడులలో భాగంగా కొందరు వ్యక్తులు బెల్లం మరియు పటికను రవాణా చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు చంద్రుగొండ గ్రామ శివారులలో ఈరోజు తెల్లవారుజామున వాహన తనిఖీలను చేపట్టగా చెన్నారావుపేట మండలం అడ్డబాట తండా కు చెందిన భూక్య కీమ్య s/o హేమ్ల అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి అక్రమంగా రైలులో బెల్లం మరియు పటికను తీసుకొని వచ్చి రాత్రిపూట రైలు చైన్ లాగి గేట్పల్లి తండా సమీపంలో రైలు నుండి బెల్లం మరియు పటిక బస్తాలను దింపుకొని తన ద్విచక్ర వాహనం పైన తన గ్రామానికి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో 70 కేజీల నల్ల బెల్లం మరియు 20 కేజీల పటిక మరియు అతడు ద్విచక్ర వాహనం మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి కానిస్టేబుల్స్ నాగరాజు, రంజిత్, దిలీప్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS

ఓటు హక్కుపై బీజేపీ దాడి…. సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర ….  బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం…..  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

TNR NEWS

లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు

Harish Hs

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

TNR NEWS

మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం – ఉడార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs