కోదాడ పట్టణంలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటుచేసి క్రీడల అభివృద్ధికి పాలడుగు ఖ్యాతి చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. పట్టణంలోని తేజా టాలెంట్ స్కూల్లో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. యువతకు విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతి మాట్లాడుతూ రెండు రోజులపాటు కోదాడలో పోటీలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు. రెండవ రోజు 12 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొనగా టాప్ చాంపియన్ షిప్ యూత్ జూనియర్,సీనియర్ విభాగం మెన్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వారు విజేతలుగా నిలిచారు. ఉమెన్ విభాగంలో సూర్యాపేట జిల్లా విజేతలుగా నిలిచారు. వీరితోపాటు ఉత్తమ వెయిట్ లిఫ్టర్ యూత్ ఉమెన్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఏ తోని శ్రీ జూనియర్ సీనియర్ విభాగంలో సిహెచ్ అనూష మేడ్చల్ మల్కాజ్ గిరి, మెన్ బెస్ట్ వెయిట్ లిఫ్టర్ యూత్ లో ఖమ్మం కు చెందిన కే అభిరామ్ జూనియర్ సీనియర్ లో కే మోహన్ లు బెస్ట్ వెయిట్ లిఫ్టర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలను కోదాడ ప్రాంతానికి పరిచయం చేసిన తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతిని పలువురు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకట్రావు, ఎస్ ఆర్ కె మూర్తి, దేవ బత్తిని నాగార్జున, కోటిరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు,ఆకుల శ్రీనివాస్,సూర్యపేట జిల్లా అధ్యక్షులు పుల్లారావు, జానకిరామయ్య, హనుమంత రాజు, శివ,కృష్ణమూర్తి, శ్రీనివాస్, గణేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు………….

previous post
next post