Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహనికి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూవ్వుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తొలి మహాత్మాభిరుదాంకితులు, సామాజిక సంఘ కర్త, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మ జ్యోతి రావు పూలే 134వ, వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వారు 150 సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్న సమయంలోనే అగ్రవర్ణాల అణిచివేతకు వ్యతిరేకంగా, ఎనుకబడిన వర్గాల సంక్షేమంకై, అభివృద్ధికై, హక్కులకై, స్వాతంత్రం లేని రోజుల్లోనే పోరాటాలు చేసిన మహా గొప్ప నాయకుడు పూలే అని, వారి త్యాగ ఫలితంగానే వెనకబడిన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నామని, ప్రతి ఒక్కరము వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి త్యాగాలు వారి పోరాటాలు భావితరాలకు తెలిసే విధంగా వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారి చరిత్ర ను పాఠ్యాంశాలలో చేర్చినట్లు అయితే నేటి యువత వారి చరిత్రను తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేస్తారని అన్నారు. వారు వెనుకబడిన వర్గాల మహిళలకు విద్యాభ్యాసాలు నేర్పించుటకు తన సతీమణి అయిన సావిత్రిబాయి పూలే కు తను విద్యను నేర్పి ఈ దేశంలోనే ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలును చేసి స్త్రీలకు విద్యను అందించినాడని, అదేవిధంగా సతీసహగమనాన్ని, అంటరానితనాన్ని, సాంఘిక దురాచారాలను అరికట్టి, తను సంతానాన్ని కలిగి ఉంటే స్వార్థం వస్తుందని ఆలోచన చేసి పిల్లలను కనకుండా ఒక బీద బ్రాహ్మణ అబ్బాయిని దత్తత తీసుకొన్నాడని, సొంతంగా పాఠశాలలను, వసతి గృహాలను, వైద్యశాలలను నెలకొల్పి ఉచితంగా సేవలను అందించినాడని అన్నారు. ఆ రోజుల్లో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్లేగు వ్యాధి ప్రబలి అనేకమంది చనిపోతుంటే తను, తన సతీమణి ఇద్దరూ కూడా ప్లేగు వ్యాధిగ్రస్తులకు నిరంతరము వైద్యము ఆహారమును అందిస్తూ చివరికి అదే ప్లేగు వ్యాధితో మరణించడం జరిగినది. వారు తమ చివరి రక్తపు బొట్టు వరకు అణగారిన వర్గాల హక్కులకై అభివృద్ధిపై పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన త్యాగశీలి అని కొనియాడారు.నేడు బీసీ లంతా ఐక్యతగా ఉండి మనమందరం కూడా వారి ఆశయ సాధన కొరకు కృషి చేయాలని, అప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారమైతామని అన్నారు. బీసీ కుల గణనను వెంటనే పూర్తి చేసి బీసీలకు దమాషా పద్ధతి ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నగేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, మేర కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కీర్తి వెంకటేశ్వర్లు, మిట్ట కోల యుగేందర్, బైరు విజయ్ కృష్ణ గౌడ్, దాసరి వెంకన్న యాదవ్, మంతాపురం వెంకటేశ్వర్లు,కోడి లింగయ్య యాదవ్, యలగందుల వెంకటేశ్వర్లు, దోరపల్లి రవి, మట్ట రమేష్ యాదవ్, మానపురి యాదగిరి, బంటు నాగేందర్ ముదిరాజ్, పసలు సైదులు, జక్కుల రామచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

Harish Hs

సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి డిఎస్పి బదిలీ. వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి  ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ కు వినతిపత్రం అందజేత

TNR NEWS

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం*  – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 

TNR NEWS