హైదరాబాద్: చలితో రాష్ట్రం గజగజలాడుతున్నది. రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లే రికార్డు అవుతున్నాయి.
ఏజెన్సీ ఏరియాలతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నది.