సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన ఆత్మీయ వేడుకోలు సన్మాన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడిచిన ఐదు సంవత్సరాలు సూర్యాపేట పట్టణ అభివృద్ధికి నాకు సహకరించిన కౌన్సిల్ పాలకవర్గానికి మున్సిపల్ అధికారులకు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ పాలకవర్గం సూర్యాపేట చరిత్రలోనే ఎంతో ఆదర్శంగా ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే కరోనా వ్యాధి వ్యాపిస్తున్న లెక్కచేయకుండా ప్రజల్లో ఉండి ప్రజల ప్రాణాలు కాపాడి అదేవిధంగా ఎన్నో నిలిచిపోయే ఉన్నత కార్యాలయాలు, మెడికల్ కాలేజ్ మీనీ ట్యాంక్ బండ్ లాంటివి మరెన్నో నిర్మించి సూర్యాపేటకు బహుమతిగా అందించాము అని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఎలా ఉన్నారో ఇకపై కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను నెరవేరుస్తూ మరల ప్రజల ఆశీర్వాదాలతో విజయం సాధించి కౌన్సిల్ పాలకవర్గంలో నిలుస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. తదన అనంతరం కౌన్సిలర్ అందరూ వారి వారి అనుభవాలను తెలియజేస్తూ వారిని గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ గౌరవ కౌన్సిలర్ల పదవీకాలం తీరిన మీరు చింతపడాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు అధికారులకు మార్గదర్శకులుగా ఉంది ప్రజల సమస్యలు ఎప్పుడు తీసుకువచ్చిన వాటిని నెరవేర్చుటకు నేను మా అడ్మినిస్ట్రేటివ్ మీకెప్పుడు అందుబాటులో ఉంటాము అని కమిషనర్ అన్నారు. తదనంతరం గౌరవ కౌన్సిలర్లు అందరికీ సన్మానం చేసి వారి చిత్రపటాలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఈ ఈ కిరణ్, డి ఈ సత్య రావు, రెవెన్యూ ఆఫీసర్ కళ్యాణి,శానిటేషన్ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ ఐ గౌస్, టిపిఓ సోమయ్య, ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్ ఎస్ ప్రసాద్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు