సూర్యాపేట: సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలునవంబర్ 29,30, డిసెంబరు 1 తేదీలలో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి.ఈ మహాసభల విజయవంతం కై గత 20 రోజులుగా8 కమిటీలుగా ఆహ్వాన సంఘంగా ఏర్పడి మహాసభల విజయవంతం కై ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మహాసభల ప్రచారం కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన వీధుల్లో వాల్ రైటింగ్, సిపిఎం పార్టీ జెండాలు,తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరణ చేశారు.దీంతో సూర్యాపేట పట్టణం ఎర్రమయంగా తయారు అయింది. ఈ మహా సభలకు జిల్లా వ్యాప్తంగా 500 మంది ఎంపిక చేసిన ప్రతినిధులుల తో పాటుఆహ్వానితులు, సీనియర్ సిటిజన్స్ ఈ మహాసభలో పాల్గొంటున్నారు. సూర్యాపేట పట్టణంలో మహాసభల ప్రచారానికై మైకు ప్రచారం విస్తృతంగా చేపట్టారు. మహాసభల నిర్వహణకోసం జిల్లావ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు ఇంటింటికి సిపిఎం పేరుతో ప్రజల వద్దకు వెళ్లి మాస్ ఫండ్ క్యాంపెయిన్ చేపట్టగా ప్రజల నుండి విస్తృతంగా స్పందన వచ్చింది.
*నేడు బహిరంగ సభ…*
సిపిఎం పార్టీ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో వేలాది మందితో బహిరంగ సభనిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కుడ కుడ రోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్ మిల్లు నుండి ప్రజా ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనకు ముందు1000 మంది యువకులచే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు జరగనుంది. ఈ కవాతు విజయవంతంకై వివిధ మండలాల్లో యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ప్రదర్శన500 మంది కోలాట దళం, డప్పు కళాకారులతో పాటు విచిత్ర వేషధారణలు ఉంటాయి. ర్యాలీ అనంతరం వేలాది మందితో గాంధీ పార్కులో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకుసిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుజూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మిహాజరవుతున్నారు.
*మహాసభలకు ఏర్పాట్లు పూర్తి…*
*సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*
ఈనెల 29,30, డిసెంబర్ 1 తేదీలలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా తృతీయ మహాసభల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి అన్నారు. మహాసభల సందర్భంగా ఈనెల 29న గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా రెండు రోజులపాటు హాజరయ్యే ప్రతినిధులకుఎలాంటి లోటుపాట్లు లేకుండాఅన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.