పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు గురువారం నాడు 12/6/25 పాఠశాల పున ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం చేత అందించే ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ శ్రీ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడినారు, పూర్వ విద్యార్థిగా పాఠశాల విద్యాభివృద్ధికి గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు పట్టుదలతో కృషి చేసి పాఠశాలను రాష్ట్రస్థాయిలో ది బెస్ట్ స్కూల్ గా నిలపాలని కోరారు. కోదాడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రామచంద్ర రావు మాట్లాడుతూ కోదాడ బాయ్స్ హై స్కూల్ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అనేక విద్యా సంబంధ కార్యక్రమాలు నిర్వహించడం జిల్లా స్థాయిలో ది బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్ గా ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. కోదాడ మండల విద్యాధికారి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్ పాఠశాల ప్రారంభం రోజున నూతన అడ్మిషన్లు చేయడం జరిగింది. పాఠశాల విద్యాభివృద్ధిని ప్రగతిని జిల్లా స్థాయిలో నిలిపిన విద్యార్థులు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల అంకితభావంతో కృషి చేయాలని కోరారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ సీనియర్ ఉపాధ్యాయురాలు వి. మీనాక్షి పాఠశాలలో జరిగిన విద్యాసంబంధ కార్యక్రమాలు రిజల్ట్స్ ప్రత్యేక వసతులు సౌకర్యాలు గురించి తెలియ చెప్పడం జరిగింది. అనంతరం ఓపెన్ టాప్ జీప్ పై జిల్లాస్థాయి టాపర్స్ నిలిచిన విద్యార్థులు కరపత్రం ,ప్లెక్సీ , ప్లే కార్డ్స్ వాయిస్ రికార్డు, టూ వీలర్స్ బైకులతో పాఠశాల నుండి ఖమ్మం క్రాస్ రోడ్డు ,రంగా థియేటర్ సెంటర్ మీదుగా భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించినారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.