పత్రిక స్వేచ్ఛను హరించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు జవాబు దారి తనంగా ఉండాల్సిన అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై మాటల దాడికి దిగడం సమంజసం కాదని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.
సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారిని కె. అశోక్ కుమారును సస్పెండ్ చేయాలని గురువారం ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల,పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ దురుసుగా పవర్తిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టిస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయులను గాలికి వదిలేసి, తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, అవినీతి అక్రమాలకు విక్రమార్కుల్లా చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ , విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విలేకరులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే జర్నలిస్టులంతా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు.